ETV Bharat / state

రైతుల పాలిట శాపంగా మారిన జోరు వానలు - కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు

రైతుల పాలిట ఏకధాటి వానలు శాపంగా మారాయి. భారీ వర్షాలతో పత్తి, మిర్చి పంటల రైతులు నష్టపోతున్నారు. వర్షాలు కొనసాగితే పత్తి, మిర్చి దిగుబడులపై తీవ్ర ప్రభావం ఉంటుందని రైతుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

heavy-rains-in-krishna-district
author img

By

Published : Oct 25, 2019, 10:55 PM IST

రైతుల పాలిట శాపంగా మారిన జోరు వానలు

కృష్ణా జిల్లాలో భారీ వర్షాలతో పత్తి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. రెండు నెలలుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు తదితర మెట్ట ప్రాంతాల్లో మిర్చి, పత్తి వంటి వాణిజ్య పంటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు..... కాయ దశలో ఉన్న పత్తి రాలిపోతోంది. అలాగే భూమిలో తేమశాతం పెరిగి మిర్చి మొక్క ఎదుగుదలపై ప్రభావం కనబడుతోందని రైతులు చెబుతున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే పత్తి, మిర్చి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Intro:ap_vja_24_25_bhari_varsalu_pantalu_nastam_ap10047

Body:భారీ వర్షాలతో తో వాణిజ్య పంటలకు తీరని నష్టం

Conclusion:సెంటర్ జగ్గయ్యపేట లింగస్వామి. భారీ వర్షాలతో పత్తి , మిర్చి వంటలకు నష్టం. గడిచిన రెండు నెలలుగా నిర్విరామంగా కురుస్తున్న భారీ వర్షాలు మిర్చి, పత్తి పంటల కు శాపంగామారాయి. కృష్ణాజిల్లాలో మెట్ట ప్రాంతమైన జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు ప్రాంతాల్లో మిర్చి, పత్తి వంటి వాణిజ్య పంటలు విస్తారంగా సాగు చేస్తున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు కాయ దశలో ఉన్న పత్తి పంటకు నష్టం కలుగుతోంది పత్తి చెట్లకు కింది భాగంలో కాసిన కాయలు అధిక వర్షాలకు నల్లగా మారి,గుడ్డు పత్తి గా మిగులుతోంది. చెట్ల పై భాగంలో ఉన్న పిందె, గూడ రాలిపోతున్నాయి. దీంతో ఎకరానికి రెండు నుంచి 3 క్వింటాలు వరకు వరకు నష్టం జరుగుతుందని రైతులు చెబుతున్నారు. మిర్చి పంట సాగు మొదలై రెండు మాసాలు అవుతోంది ప్రస్తుతం మొక్క ఎదుగుదల, పూత దశలో ఉంది ఇది అధికంగా కురుస్తున్న వర్షాలకు భూమిలో తేమశాతం పెరిగి మొక్క ఎదుగుదల పై ప్రభావం కనబడుతుంది. పూత రాలిపోతుంది ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రైతులు అదనంగా ఎరువులు అందించాల్సి వస్తుంది . దీనివల్ల ఎకరానికి వెయ్యి నుంచి రెండు వేల వరకు ఎరువుల రూపేనా అదనపు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. వర్షాలు ఇదేవిధంగా గా కొనసాగితే పత్తి, మిర్చి దిగుబడులపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని రైతులు పేర్కొంటున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.