ETV Bharat / state

పొలాల్లో వాన నీరు.. రైతు కంట కన్నీరు

author img

By

Published : Apr 11, 2020, 3:36 PM IST

చిన్న చినుకులు పడ్డాయి. అరగంట వ్యవధిలో ఉరుములు.. మెరుపులతో అతి భారీ వర్షం కురిసింది. మంచుగడ్డలతో కూడిన వానొచ్చింది. సుడిగాలి చుట్టేసింది.. 30 నిమిషాలపాటు జరిగిన బీభత్సంలో మొత్తం వరి గింజ నేలరాలిపోయింది.. అన్నదాత చూసుకుంటే ఆఖరికి ఏమీ మిగల్లేదు. ఎకరానికి 40 బస్తాల దిగుబడులు వస్తాయని ఆశించారు. 2 బస్తాలు కూడా రాని దుస్థితి. పశువులకు గడ్డి మాత్రమే మిగిల్చింది.

heavy crop loss with rain in krishna district
తడిసిన వరి పనలు చూపుతున్న రైతు

నేలవాలిన పంటలు.. తడిసిన వరి పనలు...పొలాల్లో నిలిచిన నీళ్లు.. అన్నదాత బతుకుల్లో కన్నీళ్లు. కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. రైతులు తడిసిన పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏటా పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి పగబట్టినట్లు వ్యవహరిస్తుందని కన్నీటి పర్యంతమవుతున్నారు. జిల్లాలో కురిసిన వడగళ్ల వాన తీరని విషాదాన్ని నింపింది. బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో వేలాది హెక్టార్ల పంట నేలవాలి నీళ్లలో నానుతోంది. పొలాల్లో నీళ్లు బయటకు తీసినా పంట దక్కేలా కనిపించడం లేదని సాగుదారులు ఆవేదన చెందుతున్నారు.

సర్వేకు ప్రత్యేక బృందాలు

వర్షాల కారణంగా నష్టపోయిన పంట అంచనా వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 8 మండలాల్లో 9,733 హెక్టార్లలోని పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి చూస్తే అంతకు మించి నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో వీఆర్వో, వ్యవసాయ సహాయకులు ఇతర సిబ్బందితో ఏర్పాటు చేసిన బృందాలు తమ ప్రాంతాల్లో పర్యటిస్తూ పంట నష్టం అంచనాలు వేసేందుకు సిద్ధమయ్యాయి. అంచనాల్లో పాటించాల్సిన నిబంధనలపై సిబ్బందికి అవగాహన కల్పించి సమాయత్తం చేశారు.

8 మండలాల్లోనే కాకుండా మిగతా ప్రాంతాల్లోనూ పొలాలు నేల వాలాయని సాగుదారులు వాపోతున్నారు. గూడూరు మండలంలోని మల్లవోలు, బందరు మండలంలోని సీతారాంపురం, ఎస్‌.ఎన్‌. గొల్లపాలెం, సుల్తానగరం తదితర గ్రామాలతోపాటు పలు మండలాల్లో కూడా పంటలు నష్టపోయాయి. వాటినీ పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. 35 శాతం పంట నష్టపోయిన పొలాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు చెప్పారు.

'పంట నష్టపోయిన గ్రామాల్లో అంచనా వేసేందుకు సిబ్బందిని నియమించాం. వారంతా ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ సర్వే చేస్తున్నారు. నష్టపోయిన ప్రతి ఎకరాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన రైతులకు పరిహారం అందేలా కృషి చేస్తాం. అంచనాల్లో ఏమైనా సందేహాలుంటే మండల వ్యవసాయ శాఖ అధికారి దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం.' - టి.మోహనరావు, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు

ఇవీ చదవండి:

అకాల వర్షం.. అపార నష్టం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.