ETV Bharat / state

కరోనా కేసులపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష - వైద్యరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష

కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా పొన్నూరు, తెనాలిలో కరోనా పాజిటివ్ కేసులపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

కరోనా కేసులపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఆళ్ల నాని

author img

By

Published : Mar 15, 2021, 2:49 PM IST

గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో కరోనా కలకలంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. వెంటనే జిల్లాల వైద్యాధికారులతో సంప్రదింపులు జరిపి.. అప్రమత్తం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు, తెనాలిలో కరోనా పాజిటివ్ కేసులపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. క్వారంటైన్​లో ఉన్న కరోనా బాధితులకు మెడికల్ కిట్లు అందజేయాలని సూచించారు. కాంటాక్టు వ్యక్తులకు తెనాలి ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందిగా స్పష్టం చేశారు.

పొన్నూరులోని ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు చేయాలని ఆదేశించారు. కృష్ణా జిల్లాలో కరోనా కేసుల దృష్ట్యా వైద్యబృందాలు అప్రమత్తంగా ఉండి, ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టాలని సూచించారు. జగ్గయ్యపేటలో బాధితులను హోం క్వారంటైన్‌కు తరలించామన్నారు. విజయవాడ ఆస్పత్రిలో 40మందికి వైద్యం అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రాజ్​భవన్​కు ఎస్​ఈసీ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై గవర్నర్​తో భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.