కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులు తమ పద్ధతులు మార్చుకొని మహమ్మారి నుంచి బాధితులను గట్టెక్కించేందుకు సహకరించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రులు పెద్దిరెడ్డి, పేర్ని నానితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లా పరిధిలో 745 ఐసీయూ పడకలు.. 1,891 ఆక్సిజన్‌తో కూడిన నాన్ ఐసీయూ పడకలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొవిడ్ మార్గదర్శకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
మరిన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్, అత్యవసర మందుల సరఫరాపైనా దృష్టి సారిస్తామన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల సరఫరా, వినియోగం, సామాజిక మాధ్యమాల్లో వచ్చే అంశాలపై దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించినట్లు చెప్పారు. కొవిడ్ పరీక్షలు, టీకా కేంద్రాలు ఒకేచోట లేకుండా విడివిడిగా ఉండేలా చూడాలని మరో మంత్రి పేర్ని నాని సూచించారు. ఆరోగ్యశ్రీ కార్డులను కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు పరిగణనలోకి తీసుకోవటం లేదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు.
ఇదీ చదవండి:
ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు 50 శాతం బెడ్లు: సీఎం జగన్