ETV Bharat / state

చర్చకి రమ్మన్నారు.. పైపు లైన్ వేయబోయారు

కృష్ణా జిల్లాలో హెచ్​సీఎల్ పైపులైను బాధిత రైతులు నిరసన చేస్తుంటే అధికారులు సర్దిచెప్పి చర్చకు పిలిచారు. కానీ, అధికారులు హెచ్​సీఎల్ పక్షాన నిలబడ్డారు. రైతులు లేకుండా పైప్​లైన్ వేస్తుంటే పెద్ద ఎత్తున రైతులు అడ్డుకున్నారు. దీంతో రైతుల తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని రైతులు పొలాల్లోనే కూర్చుని డిమాండ్ చేశారు.

krishna distrct
HCL pipeline
author img

By

Published : May 23, 2020, 12:39 PM IST

కృష్ణా జిల్లాలో హెచ్​సీఎల్ పైపులైను బాధిత రైతులు రెండోరోజు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే.. చందర్లపాడు మండలం మెజిస్ట్రేట్ రైతుల దగ్గరకు వచ్చి వారితో మాట్లాడారు. పైపులైను బాధిత రైతులు, రైతు సంఘం, సీపీఎం నాయకులు పైపులైను విషయంపై రేపు కలెక్టర్ చర్చలకు రమ్మన్నారని చెప్పారు. చర్చలకు వెళ్లి వచ్చేదాకా పైపులైను పనులు ఆపాలని రైతులు కోరారు.

ఎమ్మార్వో, చందర్లపాడు ఎస్ఐ హామీతో పొలాల దగ్గర నుంచి రైతులు వెనుతిరిగారు. కానీ, హెచ్​సీఎల్ అధికారుల పక్షాన అధికారులు నిలబడ్డారు. బాధిత రైతులు లేకుండా పైప్​లైన్ వేయబోయారు. దీంతో పెద్ద ఎత్తున రైతులు అడ్డుకున్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని అధికారులకు చెప్పి అక్కడే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని రైతులు పొలాల్లోనే కూర్చుని డిమాండ్ చేశారు.

ఇది చదవండి జిల్లాలో 409కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.