ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను గుడివాడ పోలీసులు పట్టుకున్నారు. మహమ్మద్ ఆలీ తెలంగాణలోని మధిర, ఖమ్మం, ఏపీలోని నెల్లూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో వరుస చోరీలు చేశాడు. బంగారు ఆభరణాలు దొంగిలించి... విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఒక్క ఏడాదిలోనే 13 చోట్ల చోరీ చేశాడని... గుడివాడ డీఎస్పీ సత్యానందం వివరించారు. అతని నుంచి రూ.7లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: