రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ వైర్లను తొలగించి...ప్రయాణికులపై దాడి చేసి... దోపిడీలకు పాల్పడుతున్న పార్థిగ్యాంగ్ ప్రధాన నిందితుడు అవినాష్ శ్రీరామ్ కాలేను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్టు చేశారు. సికిందరాబాద్ స్టేషన్లో తచ్చాడుతున్న అవినాష్‌ను పోలీసులు పక్కా ప్రణాళికతో అరెస్టు చేశారు. నిందితుడు నుంచి రెండు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే ఎస్పీ అనూరాధ తెలిపారు.
ఎలా చేసేవారంటే...
'వేర్ ఈజ్ మై ట్రైన్' అనే యాప్ ద్వారా రైలు ఉన్న ప్రదేశాన్ని తెలుసుకుని... సిగ్నల్ వైర్లను తొలగించి దోపిడీలకు పాల్పడేవారు. ఈ ముఠాకు చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామన్నారు.
ఇదీ చూడండి: వజ్రాలహారం మాయం... విలువెంతో తెలుసా?