రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8.45 గంటల నుంచి 9.45 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. సమయం ముగిసిన తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్ష రాయటానికి అనుమతించలేదు.
ఈ పరీక్షల కోసం హైదరాబాద్ సహా రాష్ట్రంలో 41 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాన్ని తొలిసారిగా ట్యాబ్‌లో పొందుపరిచి అభ్యర్థులకు ఇచ్చారు. ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో ప్రశ్నాపత్రాలను అందుబాటులో ఉంచారు. కరోనా వ్యాప్తి నివారణ కోసం పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు తీసుకువచ్చిన వారిని మాత్రమే పరీక్ష రాసేందుకు అనుమతించారు. ట్యాబ్‌ల ద్వారా పరీక్ష నిర్వహించడంపై అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.