ఇదీ చదవండి:
గుడివాడలో విద్యుత్ తీగలు తగిలి లారీ దగ్ధం - గుడివాడలో గడ్డి లారీ దగ్ధం తాజా వార్తలు
కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రహదారిలో విద్యుదాఘాతంతో వరిగడ్డి లారీ దగ్ధమైంది. మదినేపల్లి మండలం పెదపాలపర్రు నుంచి తిరుమల గోసంరక్షణ కోసం లారీలో వరిగడ్డిని తరలిస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలాయి. ఒక్కసారిగా లారీ నుంచి మంటలు చెలరేగగా.. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. వరిగడ్డి పూర్తిగా దగ్ధమవ్వగా... లారీ స్వల్పంగా కాలిపోయింది.
గుడివాడలో విద్యుదాఘాతంతో గడ్డి లారీ దగ్ధం