గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు మరో వారం పాటు గడువు పెంచుతున్నట్లు.... ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై....... గడువు పెంచామని అన్నారు. గ్రేడ్ - 2 గ్రామ వ్యవసాయ సహాయకుల పోస్టులకు కూడా విద్యార్హతలను సడలిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నందున.. అర్హులందరూ దరఖాస్తు చేసుకోడానికి తగిన సమయం అవసరమని భావిస్తున్నట్లు గిరిజాశంకర్ తెలిపారు. ఏదైనా డిగ్రీతో పాటు ప్రఖ్యాత శిక్షణ కేంద్రంలో కంప్యూటర్ కోర్సు చేసినట్లు.... ధ్రువపత్రం కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోడానికి అర్హులుగా ప్రతిపాదించామని కమిషనర్ వివరించారు . ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక ..ఈ విషయంలో అధికారిక ప్రకటన చేస్తామని ఆయన పేర్కొన్నారు
ఇవీ చదవండి