బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు చెప్పారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులన్నారు. చిన్నారులు దేశానికి నిజమైన బలం, సమాజానికి పునాది అని పేర్కొన్నారు. వారిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. భవిష్యత్ పౌరులుగా.. మాతృభూమిని రక్షించి, దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: నర్సీపట్నంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు