విజయవాడలోని ఎమ్ జే నాయుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ ప్రారంభించారు. ఆసుపత్రి 33వ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్ జే నాయుడు ఛారిటబుల్ ట్రస్టు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా పాఠశాల, కళాశాలల్లో వివిధ అంశాలపై ట్రస్టు నిర్వహించిన పోటీల్లో విజేతలకు గవర్నర్ బహుమతులు అందజేశారు. ప్రజల ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆనందంగా ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రైవేటు ఆసుపత్రులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారం అందించాలని బిశ్వభూషణ్ సూచించారు.
ఇదీ చదవండి :