Governor Biswabhusan Harichandan: రాష్ట్ర పౌరులంతా స్వచ్చంధంగా ముందుకు వచ్చి అధార్ తో ఓటరుకార్డును అనుసంధానం చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. బలమైన ప్రజాస్వామ్యానికి ఓటు పునాది వంటిదని, అధార్ తో అనుసంధానం చేసుకోవటం వల్ల ఎన్నికల వ్యవస్ధలో పారదర్శకతను ఆశించగలుగుతామని పేర్కొన్నారు. రాజ్ భవన్ వేదికగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో గవర్నర్ దంపతుల ఓటరు గుర్తింపు పత్రాలను అధార్ నెంబర్ తో అనుసంధానం చేయించారు. ఓటరు కార్డు, అధార్ కార్డుల అనుసంధానం తప్పనిసరి కానప్పటికీ పౌరులు తమవంతు బాధ్యతగా ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాలని గవర్నర్ సూచించారు. విస్తృత ప్రచారం ద్వారా ఈ కార్యక్రమం పట్ల అందరికీ అవగాహన కల్పిస్తున్నామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలను నిర్వహించటం ద్వారా అధార్ తో అనుసంధానం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని నివేదించారు.
ఇవి చదవండి: