ETV Bharat / state

అటల్ బిహారీ వాజ్‌పేయికి గవర్నర్ బిశ్వభూషన్ నివాళి - అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి వేడుకలు

భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 96వ జయంతిని పురస్కరించుకోని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాలను కలిపే ‘గోల్డెన్ కారిడార్’ అభివృద్ధికి వాజ్‌పేయి ఎంతో కృషి చేసారని కొనియాడారు. మారుమూల గ్రామాలకు అనుసంధానం కల్పించే ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం అమలులో ఆయన సహకారం మరువలేనిదని అన్నారు.

Governor Bishwabhushan Harichandan
అటల్ బిహారీ వాజ్‌పేయికి గవర్నర్ బిశ్వభూషన్ నివాళి
author img

By

Published : Dec 25, 2020, 2:53 PM IST

మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 96వ జయంతి సందర్భంగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆయనకి నివాళులర్పించారు. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాలను కలిపే ‘గోల్డెన్ కారిడార్’ అభివృద్ధికి వాజ్‌పేయి ఎంతో కృషి చేసారని కొనియాడారు. ఒడిశా ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్న రోజులను గవర్నర్ గుర్తుచేసుకున్నారు. జాతీయ రహదారుల ప్రాజెక్టు దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కలల ప్రాజెక్టు అని తెలిపారు.

మారుమూల గ్రామాలకు అనుసంధానం కల్పించే ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం అమలులో ఆయన సహకారం మరువలేనిదని అన్నారు. పోఖ్రాన్-II పరీక్షను విజయవంతంగా నిర్వహించడం ద్వారా వాజ్‌పేయి భారతదేశ హోదాను ప్రపంచ స్థాయిలో అణు సూపర్ పవర్‌గా పెంచారన్నారు. అలాగే దేశ భద్రతను మరింత బలోపేతం చేశారని, గొప్ప వక్త, రచయిత, కవిగా రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా అందరిచేత గౌరవ వందనాలు అందుకున్నారని చెప్పారు.

ఇదీ చదవండీ..

.రాష్ట్రంలోని 4 ఆసుపత్రుల్లో ప్రాణవాయువు ఉత్పత్తి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.