వరద సహాయక చర్యలను ప్రభుత్వం సమన్వయంతో చేపట్టలేదని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. అధికారులతో ముందస్తు సమీక్ష చేపట్టకపోవటాన్ని ఆయన తప్పుబట్టారు. గోదావరి వరదల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ... ప్రభుత్వం నామమాత్రపు చర్యలతో సరిపెట్టడం సరికాదన్నారు. ఇప్పుడు కృష్ణా నదికి వరదలు వస్తున్నా... ముఖ్యమంత్రి తనకేమీ పట్టనట్టు వ్వవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి:నిద్రలో జారిపడి.. ప్రాణం పోగొట్టుకున్నాడు!