కృష్ణాజిల్లాలో క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను జరుపుకున్నారు. పెనుగంచిప్రోలు, మోపిదేవి, కంచికచర్లలో శిలువ మార్గం కార్యక్రమం నిర్వహించారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శిలువను భుజాన మోస్తూ.. యేసు కీర్తనలు పాడుతూ వందలమంది శిలువ యాత్రలో పాల్గొన్నారు. ప్రజలను కాపాడేందుకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన యేసును తలుస్తూ.. కన్నీటితో శిలువను మోశారు.
విజయవాడ గుణదల మేరి మాత పుణ్యక్షేత్రంలో పరిశుద్ధ శిలువ మార్గం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే క్రైస్తవులు మందిరానికి చేరుకుని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం గుణదల కొండ మార్గం నుంచి నడుచుకుంటూ.. పైకి చేరుకుని యేసును స్మరిస్తూ కీర్తనలు పాడారు. పెద్దఎత్తున క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి..