కృష్ణా జిల్లా కోడూరు మండలం కేంద్రంలో కంచెర్లపల్లి వంశీయుల ఆడపడుచు గంగా భవాని అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. మొదటగా వారి ఇంటి వద్ద అమ్మవారి పట్టు వస్త్రాలు, ఆయుధాలకు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు కళాకారులతో ఊరేగింపుగా బయలుదేరి.. గంగానమ్మ గుడి వద్ద అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఇదీ చదవండి: క్షుద్రపూజల పేరిట యువతిపై అత్యాచారం
గ్రామోత్సవంలో భాగంగా.. తొలిపూజ కోసం అమ్మవారిని స్థానిక పోలీస్ స్టేషన్కు మేళ తాళాలతో తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయాన్ని 45 ఏళ్ల క్రితం అప్పటి కోడూరు స్టేషన్ ఎస్సై ఏవీఎస్ రెడ్డి అభివృద్ధి చేయడంతో.. ఈ పూజ అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఆలయంలో, పోలీస్ స్టేషన్లో కోడూరు ఎస్సై రమేష్ దంపతులు పూజలు నిర్వహించారు. అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ భాషా, సీఐలు బీబీ రవికుమార్, వెంకట నారాయణతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొన్నారు. ఈనెల 14న అమ్మవారి ప్రధాన గుడి వద్ద జాతర జరగనున్న నేపథ్యంలో.. నేటి నుంచి ఇంటింటికీ ఊరేగింపు ప్రారంభమైంది.
ఇదీ చదవండి: