ETV Bharat / state

పాప కిడ్నాప్.. 5 గంటల్లో తల్లిదండ్రుల ఒడికి చేర్చిన పోలీసులు

ఆరేళ్ల పాప కిడ్నాపైంది. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 5 గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్నారు. పాపను క్షేమంగా అమ్మానాన్నల వద్దకు చేర్చారు. చాకచక్యంతో కొన్నిగంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించారు కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు.

girl kidnap case chased by nandigama police in krishna district
పాప కిడ్నాప్.. 5 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
author img

By

Published : Jul 1, 2020, 9:45 AM IST

కిడ్నాపైన పాపను 5 గంటల వ్యవధిలో తల్లిదండ్రుల వద్దకు చేర్చారు కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు. అంబర్ పేట గ్రామానికి చెందిన అక్షర అనే ఆరేళ్ల తమ పాప మంగళవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విజయవాడకు చెందిన చందు అనే వ్యక్తి పాపను అపహరించినట్లు గుర్తించారు. చందు, పాప తండ్రి స్నేహితులు. గత సాయంత్రం చందు, పాప తండ్రికి ఫుల్లుగా మద్యం తాగించాడు. అతను నిద్రలోకి జారుకున్న వెంటనే పాపను తీసుకుని పరారయ్యాడు. సెల్​ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఇవీ చదవండి...

కాకినాడలో అగ్నికి ఆహుతైన స్కోడా కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.