ది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కృష్ణా జిల్లా గన్నవరం పట్టణానికి చెందిన ఓ విద్యార్థి చోటు సంపాదించాడు. స్థానిక విఎస్ సెయింట్ జాన్స్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి కృష్ణవంశీ... ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అతి తక్కువ ధరలో లభించే ఆటోమేటిక్ శానిటైజర్ డిస్పెన్సర్‌ను రూపొందించాడు. ఈ విషయమై విద్యార్థి కృష్ణవంశీ... ది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు దరఖాస్తు చేసుకోగా సదరు సంస్థ ప్రతినిధులు విద్యార్థి ప్రతిభను చూసి విద్యార్థికి ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
ఇదీ చదవండి:
దళితులపై జరిగిన దాడులన్నింటిపైనా సీబీఐ విచారణ జరపాలి: చంద్రబాబు