కృష్ణా జిల్లాలో జీ ప్లస్ త్రీ లబ్ధిదారులకు మంజూరైన ఫ్లాట్లు వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తూ గుడివాడలో తెదేపా నేతలు పోస్టుకార్డుల ఉద్యమం నిర్వహించారు. లబ్ధిదారుల సంతకాలతో కూడిన 700 పోస్ట్ కార్డులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పంపించారు. గుడివాడ పోస్ట్ ఆఫీస్ లో కార్డులు వేశారు.
పేద వారి సొంత ఇంటి కల నిజం చేయాలని గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. ఫ్లాట్ లను, లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రస్తుత ప్రభుత్వం తాత్సారం చేయటం దారుణమని అన్నారు. లబ్ధిదారుల ఆవేదనను అర్థం చేసుకొని తక్షణం అర్హులకు ప్లాట్లను అప్పగించాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: