కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం ఎట్టివానిగూడెంలో గతనెల 19న ఆత్మహత్యకు పాల్పడిన కొడాలి నాగబాబు మృతదేహానికి చల్లపల్లి తహసీల్దార్ సమక్షంలో గురవారం పోస్టుమార్టం నిర్వహించారు. బూసి వెంకట సుబ్బారావు అనే వ్యక్తి తన కుమారుడిని వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించటం ద్వారానే బలవన్మరణం చెందాడని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తహసీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు.
అసలేం జరిగింది....
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఎట్టివానిగూడెంకు చెందిన కొడాలి నాగబాబుకు దళిత పూజరి బూసి వెంకట సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న వెంకట సుబ్బారావు నాగబాబును వేధింపులకు గురిచేయటం మెుదలుపెట్టాడు. తనతో కలిసి ఉండాలని ఇబ్బందులకు గురిచేయటం మెుదలుపెట్టాడు. ఈ క్రమంలో గత నెల 19న నువ్వులేకుండా నేను ఉండలేనని చనిపోతున్నానని చెప్పి...,శవంలా పడుకొన్న కొన్ని ఫొటోలను సుబ్బారావు...నాగబాబుకు సామాజిక మాధ్యమాల్లో పంపించాడు. బయపడిపోయిన నాగబాబు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆలస్యంగా వెలుగులోకి...
నాగబాబు ఆత్మహత్య అనంతరం బంధువులు స్థానిక శ్మశానవాటికలో ఖననం చేశారు. కాగా గత నెల 29న నాగబాబుకు చెందిన సెల్‌ఫోన్‌ను అతని సోదరుడు చూడగా..అందులో వెంకట సుబ్బారావుతో మాట్లాడిన వాయిస్ రికార్డులు, కొన్ని ఫోటోలు లభ్యమయ్యాయి. వాటిని ఆధారంగా చేసుకొని వెంకట సుబ్బారావు వేధింపుల వల్లే నాగబాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకట సుబ్బారావుతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు...గురువారం నాగబాబు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీచదవండి