మన రాష్ట్రంలోని కృష్ణా.. తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లాలను కలిపే కంచికచర్ల - మధిర అంతర్రాష్ట్ర రహదారి.. గతుకులమయంగా మారింది. ఈ రోడ్డు ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తోంది. నిత్యం వేలాదిమంది ప్రయాణించే రహదారిపై అడుగడుగునా గోతులు పడిన కారణంగా.. వాహనాలు దెబ్బ తినడమే కాక ప్రయాణికులు కొన్ని సమయాల్లో గాయాలపాలవుతున్నారు.
కంచికచర్ల ఎర్రిపాలెం మధ్య పలు గ్రామాల్లో నుంచి వెళ్లే రహదారిలో భారీ వాహనాలు ఎదురుపడినప్పుడు గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ రోడ్డును వెడల్పు చేయడంతోపాటు గుంతలు మరమ్మత్తు చేయాలని ఖమ్మం, కృష్ణా జిల్లాల ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: