ETV Bharat / state

జూనోసిస్ దినోత్సవం..పెంపుడు జంతువులకు ఉచితంగా వ్యాక్సిన్ - జూనోటిక్ దినోత్సవం రోజున పెంపుడు జంతువులకు ఉచిత వ్యాక్సిన్లు

పెంపుడు జంతువుల ద్వారా మనుషులకు ఏ విధమైన వైరస్​లు వ్యాప్తి చెందకుండా... ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్ పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు శివదానం ప్రసాదలింగం తెలిపారు. జూనోసిస్ దినోత్సవం రోజున ప్రతి సంవత్సరం పెంపుడు జంతువులకు ఉచితంగా రాబిస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని ఆయన వివరించారు.

free rabies vaccine is given to pets on occassion of junosis day
జూనోసిస్ దినోత్సవం సందర్బంగా పెంపుడు జంతువులకు ఉచితంగా వ్యాక్సిన్
author img

By

Published : Jul 6, 2020, 12:42 PM IST

కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని పశుసంవర్ధక శాఖ ఆసుపత్రిలో... ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులకు ఉచితంగా రాబిస్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని... నూజివీడు డివిజన్ పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు శివదానం ప్రసాదలింగం ప్రారంభించారు. పెంపుడు జంతువుల నుంచి మనుషులుకు, మనుషుల నుండి జంతువులకు వ్యాపించే వ్యాధులు గురించి అవగాహన కల్పించారు. జూనోసిస్​ దినోత్సవం రోజున ప్రతి సంవత్సరం పెంపుడు జంతువులకు ఉచితంగా వ్యాక్సిన్లు వేయడం జరుగుతుందని తెలిపారు.

వ్యాధితో ఉన్న కుక్క నోటిలోని సొంగలో వ్యాధికారక వైరస్ ఉంటుందని, కుక్క కరచినపుడు పంటి గాటు ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందన్నారు. ఇది నాడి వ్యవస్థ మీద పనిచేసి పక్షవాతం కలిగించే ప్రమాదం ఉందని...ఊపిరి ఆడక, గుటక పడక మరణిస్తారన్నారు. నీరు తాగాలంటే భయమేస్తుందని, దీనిని హైడ్రోఫోబియాగా గుర్తించి, కరిచిన 10రోజులనుండి కొన్ని నెలలు తర్వాత లక్షణాలు కనిపించేలోపే ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యాధితో ఉన్న కుక్కలు పిచ్చి పిచ్చిగా తిరుగుతూ అడ్డం వచ్చే అన్ని పశువులు, మనుషులను కరుస్తూ ఉంటాయని తెలిపారు.

ఇదీ చదవండి:

సౌర విద్యుత్ నగరంగా బెజవాడ..ఎంపిక చేసిన కేంద్రం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.