విజయవాడలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పేరుతో ఓఎల్ఎక్స్ లో ప్రకటన చేసి చివరికి నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన వ్యక్తిని అజిత్ సింగ్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ, రాజమండ్రి, విశాఖ నగరాలలో నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ...అరవింద సాఫ్ట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పంచాగం దత్తాత్రేయ అనే వ్యక్తి నకిలి కంపెనీ తెరచి...నిరుద్యోల నుంచి ఒక్కొక్కరి వద్ద పదివేలు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు.
ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న అజిత్ సింగ్ నగర్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఓఎల్ఎక్స్ ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా వస్తున్న ప్రకటనలు నమ్మవద్దని విజయవాడ నగర నార్త్ జోన్ ఏసీపీ షర్ఫూద్ధీన్ తెలిపారు. నిరుద్యోగ యువత ఇటువంటి ప్రకటనలపై ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని.. ఏదైనా తేడా అనిపిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావలని ఏసీపీ కోరారు.
ఇదీ చదవండి: