ETV Bharat / state

Cheating: ఉద్యోగాల పేరుతో వల... లక్షల్లో టోకరా - కృష్ణా జిల్లా తాజా సమాచారం

కరోనా విపత్కర సమయంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజూ కొత్తదారులు వెతుక్కుంటూ ఖాతాలు ఖల్లాస్ చేస్తున్నారు. తాజాగా విజయవాడలోని ఓ వ్యక్తి.. ఉద్యోగాల పేరుతో ఆన్‌లైన్‌లో ఎరవేసి బాధితుల నుంచి అందినకాడికి దోచుకున్నాడు. చివరికి సైబర్ క్రైం పోలీసులకు చిక్కాడు.

Cheating
ఉద్యోగాల పేరు మోసం
author img

By

Published : Jun 28, 2021, 12:49 PM IST

తెలుగు రాష్ట్రాల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన జడ్సన్‌..కొవిడ్​ నేపథ్యంలో మూడు నెలలు తాత్కాలికంగా సిబ్బందిని తీసుకునేందుకు మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ను చూశాడు. మూడు నెలల నుంచి రెండేళ్లకు ఉద్యోగ కాలపరిమితి పెంచినట్లు.. అందులో ఉద్యోగం కావాల్సిన వాళ్లు తన నెంబర్‌కు ఫోన్‌ చెయ్యాలని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు. దీనిపై సైబర్‌ క్రైం పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు నిందితుడు ఇచ్చిన ఫోన్‌ నెంబర్లు ఆధారంగా లొకేషన్​ను గుర్తించి అరెస్టు చేశారు. దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

గతంలో గుంటూరు చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తి నుంచి యూనియన్‌ బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తామని రూ.90వేలు, హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని రవితేజ అనే వ్యక్తి నుంచి రూ.50వేలు, పశుసంవర్ధక శాఖలో అటెండర్‌గా ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆరుగురు బాధితుల నుంచి రూ.30వేలు, కళ్యాణి అనే మహిళకు నర్సింగ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.5వేలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు జడ్సన్‌.. దీపక్‌ రెడ్డి, నవీన్‌, కృష్ణకుమార్‌, మహేష్‌ అనే వ్యక్తులతో కలిసి మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. బాధితుల నుంచి రూ.5లక్షల మేర వసూలు చేసినట్లు స్పష్టం చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి

ప్రభుత్వ మద్యం దుకాణంలో మందుబాబులు చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.