Crypto currency: కృష్ణా జిల్లా అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు రూ.20 కోట్ల మేర ప్రజలకు టోకరా వేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అవనిగడ్డ పరిసరాల్లో అనేక మంది నుంచి క్రిప్టో కరెన్సీ పేరిట డబ్బులు వసూలు చేశారని... సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో క్రిప్టో కరెన్సీ పేరిట వల విసిరాని తెలిపారు. నిందితులు విజయవాడ, గుడివాడ, అవనిగడ్డకు చెందినవారిగా భావిస్తున్నట్లు తెలిపారు. ట్రస్ట్ వ్యాలెట్ (యూకే) అనే వెబ్సైట్ను ఏర్పాటు చేసి క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడినట్లు చెప్పారు. రూ.3.50 లక్షలు చెల్లిస్తే ప్రతినెల రూ.70 వేలు అందుకోవచ్చని, కొత్తగా సభ్యులను చేర్పిస్తే భారీ మొత్తంలో కమీషన్ కూడా లభ్యమవుతుందని ప్రజలను ముఠా ప్రలోభపెట్టారని డీఎస్పీ తెలిపారు. అవనిగడ్డ చుట్టు పక్కల గ్రామాలకు చెందిన దాదాపు 70మందిని మోసగించినట్లు తెలిపారు. త్వరలోనే మిగతా నిందితుల్ని కూడా పట్టుకుంటామని అన్నారు.
ఇవీ చదవండి: