వరుసగా 13వ రోజు పెట్రోల్ ధరల పెంపును మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. 13 రోజులుగా నిత్యం రేట్లు పెంచి... పెట్రోలు ధర రూ.80 రూపాయలు దాటించారని ఆరోపించారు. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సుంకాలు 60 శాతం పైనే ఉన్నాయని.. కరోనా కష్టకాలంలో సుంకాలు తగ్గించకపోగా ఇంకా భారం మోపుతారా అని మండిపడ్డారు. ధరల పెంపు కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వాలిచ్చే కరోనా కానుకేమో అని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: సరికొత్త పంథా: మద్యం అక్రమ రవాణాకు వక్ర మార్గాలు !