ETV Bharat / state

ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి: జవహర్ - free sand policy in ap

రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలే లారీలు కొనుగోలు చేసి, వాటికి తమ పేరులతో బోర్డులు తగిలించి ఇసుక వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు.

Former minister Jawahar
మాజీ మంత్రి జవహర్
author img

By

Published : May 31, 2021, 4:39 PM IST

మంత్రుల పేరుతో బోర్డులు పెట్టుకుని మరీ ఇసుక లారీలు తిరుగుతున్నాయని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. తెదేపా హయంలో రూ.20వేలకు లభించిన లారీ ఇసుకను ఇప్పుడు రూ.50వేలకు పైబడి కొనాల్సి వస్తోందని విమర్శించారు. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలే లారీలు కొనుగోలు చేసి, వాటికి తమ పేరులతో బోర్డులు తగిలించి ఇసుక వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్​ రెండేళ్ల పాలనలో ప్రజల కష్టాలు 20రెట్లు పెరిగాయన్నారన్నారు. తక్షణమే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని జవహర్‌ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

ఆనందయ్య మందు పంపిణీ వివరాలు ఎందుకు సమర్పించలేదు?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.