కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలులో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు గద్వాల కృష్ణ(46)కు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నివాళి అర్పించారు. పంట నష్టపోవడం వల్ల రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అన్నారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, వారికి రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందచేశారు. ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: తాను మరణించాడు.. ఇరవై మందిని రక్షించాడు!