విజయవాడ పరిధిలోని పలు ఐస్ క్రీం తయారీ కేంద్రాల్లో ఆహార భద్రత, తూనికలు కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కృత్తికా శుక్లా నేతృత్వంలో ఈ దాడులు చేపట్టారు. ఐస్ క్రీమ్ తయారీ, బాక్సులపై ఎలాంటి తయారీ తేదీలను ముద్రించకపోవటం, తయారీ కేంద్రాల్లో కనీస శుభ్రత పాటించకపోవటం వంటి వాటిపై జేసీ కృత్తికా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐస్ క్రీం తయారీ కేంద్రాలపై కేసులు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి- బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే పేరుతో అక్రమ వసూళ్లు