ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చిన్నంపెట వద్ద తమ్మిలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చిన్నంపేట - శివాపురం నడుమ వంతెనపై అడుగు మేర వరద ప్రవహిస్తోంది. వంతెనకు చిన్నంపెట వైపు గండి పడింది.
ఈ కారణంగా... కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. తమ్మిలేరు జలాశయానికి సుమారు అయిదు వేల కుసెక్కుల వరద నీరు చేరుతుండగా దిగువకు వరదనీరు విడుదల చేశారు.
ఇదీ చదవండి: