విజయవాడ నగర శివారు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పాతపాడు డంపింగ్ యార్డ్‌లో చెత్త తగలబడింది. దీంతో కిలోమీటర్ల దూరం వరకు దట్టమైన పొగలు వ్యాపించాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, మామిడి తోటల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సంఘటనాస్థలానికి చేరుకున్న పాయికాపురం అగ్నిమాపక వాహనంతోపాటు వీఎంసీకి చెందిన 10 వాటర్ ట్యాంకర్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం డంపింగ్ యార్డులో ఇదే కాలంలో ఏర్పడుతున్న మంటలు తమకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని మామిడి తోటల యజమానులు వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:
వైకాపా అభ్యర్థి గురుమూర్తిపై అభ్యంతరకర పోస్టులు..డీజీపీకి ఫిర్యాదు