ASHA WORKERS : 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఆశా కార్యకర్తల ఆరు వేలు వేతనాన్ని పది వేల రూపాయలకు పెంచింది. ఇటు జీతం పెంచటం ఆలస్యం.. వర్కర్లకు సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేసింది. ఓవైపు చాలీచాలని జీతాలు.. మరోవైపు ప్రభుత్వ పథకాలు అందక కుటుంబాలను పోషించలేక ఆశా కార్యకర్తలు ఆర్థికంగా సతమతమవుతున్నారు. కరోనా కాలంలో.. ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వాపోతున్నారు.
జాతీయ హెల్త్ మిషన్ నిబంధన ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి నుంచి 1200 మందికి, పట్టణ ప్రాంతాల్లో 2 వేల నుంచి 2,500 మందికి ఒక ఆశా వర్కర్ ఉండాలి. అయితే రాష్ట్రంలో రెండు వేల నుంచి 8వేల జనాభాకి ఒక్క ఆశా కార్యకర్తే ఉన్నారు. పని ఒత్తిడి కారణంగా పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరి ఉద్యోగుల మాదిరే తమకు వారాంతపు సెలవులు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. కనీస వేతనం పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశావర్కర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇవీ చదవండి: