విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో రైతులు ఆందోళన నిర్వహించారు. ధాన్యం బస్తాల డబ్బులు పడకపోవడంపై... రైతు భరోసా కేంద్రం వద్ద అధికారులను నిలదీశారు. సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ... అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.
పంటను అమ్మి నెలలు గడుస్తున్నా డబ్బులు రావటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను నష్టం సైతం ఇప్పటివరకు రాలేదని వాపోయారు. అప్పులు చేసి పంటను పండించామని... ప్రభుత్వం ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని అన్నారు.
ఇదీ చదవండి: