ETV Bharat / state

ఏడాదిగా అందని పంట నష్టపరిహారం

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రాకుండా పోయింది. ప్రకృతి విపత్తు పంటను ముంచేసింది. అధికారులు నష్టాన్ని అంచనా వేయటం తప్ప.. పరిహారం అందించే దిశగా చర్యలు ముమ్మరం చేయట్లేదు. దీంతో కృష్ణాజిల్లా రైతులు పెట్టుబడి లేక, అప్పులతో బాధ పడుతున్నారు.

submerged banana crop
ముంపులో తోట్లవల్లూరు అరటితోటలు (పాతచిత్రం)
author img

By

Published : Oct 12, 2020, 10:26 AM IST

కృష్ణానదికి వరదొచ్చింది.. పంటలను ముంచేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వచ్చారు. పంట నష్టాన్ని కళ్లారా చూశారు. అంచనాలు తయారు చేసి అన్నదాతలకు పరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఇది జరిగి 14 నెలలవుతోంది. ఇంతవరకు పరిహారం అందలేదు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన మళ్లీ కొద్ది రోజుల కిందట వరదొచ్చి పంటలకు నష్టం చేకూర్చింది. రైతులు మళ్లీ నష్టపోయారు.. ఎప్పటిలాగానే ప్రజాప్రతినిధులు పంట నష్టాన్ని చూశారు. పరిహారం అందిస్తామంటున్నారు.

* గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కృష్ణా నదికి భారీగా వరదొచ్చింది.. జిల్లాలో 4,685 హెక్టార్లలో 9,977 మంది రైతులకు చెందిన వివిధ పంటలు నష్టపోయారు. వారికి ~ 8.55 కోట్లు నష్టపరిహారం రావాల్సి ఉంది. అప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. అప్పులు తీరకుండానే మరల ఇటీవల వరద ముంచెత్తడంతో మరోమారు కుదేలయ్యాడు.

* జగ్గయ్యపేట, నందిగామ, చందర్లపాడు, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, కంకిపాడు, విజయవాడ రూరల్‌ ప్రాంతాలతో పాటు తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ తదితర ప్రాంతాల్లో పంటలు ముంపుబారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అరటి, బొప్పాయి, పసుపు, కంద, తమలపాకులు, మామిడి, మిర్చి, పూలతోటలు, కూరగాయలు పంటలు దెబ్బతిన్నాయి. అధికారులు 33 శాతం దెబ్బతిన్న వివిధ పంటలపై సర్వే చేసి నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఏడాది దాటినా పరిహారం అందలేదు.

* కొన్ని నెలల కిందట ప్రభుత్వం కృష్ణా, గుంటూరు జిల్లాలకు పంట నష్టపరిహారం విడుదల చేసినట్లు జీఓ జారీ చేసినా ఇంత వరకు నగదు రైతుల ఖాతాలకు జమ కాలేదు. ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరద కారణంగా సుమారు 3,975 హెక్టార్లలోని పంటలు మునిగినట్లు అంచనా. దానికి సంబంధించిన పంట నష్టం సర్వే కొన్ని మండలాల్లో ప్రారంభమైంది.

crop lost details
పంట నష్టం సర్వే వివరాలు

ఖజానా శాఖకు పంపాం

రైతులకు రావాల్సిన పంట నష్ట పరిహారానికి సంబంధించి మొత్తం బిల్లులు చేసి ఖజానా శాఖకు పంపించాం. మా వద్ద రైతులకు సంబంధించిన వివరాలు ఎటువంటి పెండింగ్‌ లేదు. ఉద్యానశాఖ తరఫున రైతులకు త్వరితగతిన నగదు అందజేసేందుకు శాఖాపరంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం నగదు ఖజానా శాఖకు వేయాల్సి ఉంది.

- జి.లక్‌పతి, ఉద్యానశాఖాధికారి

ఇదీ చదవండి: విశాఖలో కొండచరియ విరిగిపడి తల్లీబిడ్డ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.