Farmers demands good comapensation : విజయవాడ జక్కంపూడి రోడ్డులోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న 132, 220, 400 కేవీ హైటెన్షన్ విద్యుత్తు టవర్ల స్థానంలో రెట్టింపు టవర్లు నిర్మించడాన్ని ఆయా గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్నారు. రహదారుల క్రాసింగ్ ల వద్ద పెద్ద స్థాయి టవర్లు వేయడానికి చేపట్టిన భూసేకరణ ప్రక్రియ సరైంది కాదని రైతులంటున్నారు. విద్యుత్తు టవర్లు నిర్మించాలనుకుంటే తమ డిమాండ్లు పరిష్కరించాలంటున్నారు. తమ సమస్యలు తీర్చకపోతే భూములు ఇవ్వలేమని తేల్చిచెబుతున్నారు.
విజయవాడ సమీపంలోని గొల్లపూడి, జక్కంపూడి తదితర ప్రాంతాల్లో ప్రభుత్వం హైటన్షన్ విద్యుత్ టవర్ల స్థానంలో రెట్టింపు టవర్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. టవర్ నిర్మాణ ప్రాంతం, తీగలు, వెళ్లే క్యారిడర్ మార్గం, టవర్ కు పక్కగా మార్జిను ఉండేలా మొత్తం భూమిని సేకరించాలని కోరారు. ఆ భూమి మొత్తానికి మార్కెట్ రేటుకి అనుగుణంగా ధర ఇవ్వాలంటున్నారు. తమ భూములకు పది శాతం ధర ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని మండిపడుతున్నారు. తమ భూములకి మార్కెట్ రేటు ఇలాగైతేనే భూములు ఇవ్వగలమంటున్నారు. హైటెన్షన్ విద్యుత్తు టవర్ల నిర్మాణంలో విజయవాడ గ్రామీణ మండలంలోని గొల్లపూడి, జక్కంపూడి, అంబాపురం, నున్న గ్రామాల చెందిన రైతులు వారి భూములు కోల్పోనున్నారు. ప్రభుత్వం జాతీయ రహదారులు నిర్మించి, టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నారంటున్నారు. తాము మాత్రం తమ భూములు కోల్పోతామని ఆవేదన చెందుతున్నారు. టవర్లు వేసి, విద్యుత్తు ఛార్జీలు వసూలు చేసుకునే ప్రభుత్వం తమ భూములకి మార్కెట్ రేటుకి అనుగుణంగా ధర ఇవ్వాలన్నారు. విద్యుత్తు టవర్లకు భూములను ఇచ్చిన రైతులు అన్ని విధాలా నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం వారంటున్నారు. ప్రభుత్వ అధికారులు ఈరోజు ఉంటారు రేపు పోతారు తాము మాత్రం ఇక్కడే జీవిస్తామన్నారు.
వివిధ అవసరాలకు పదే పదే భూములు తీసుకుంటుంటే మా భూములు కరిగి పోతున్నాయని రైతులు వాపోతున్నారు. కొంత మంది రైతులు తమ భూమిలో మెజార్టీ భూమిని కోల్పోవలసి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. చిన్నసన్న కారు రైతులకు జీవనం ప్రశ్నార్థకంగా మారిందని మరికొందరు రైతులు అంటున్నారు.తమ సమీపంలో ఓ ప్రైవేటు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం మూతపడిందని, నిరుపయోగంగా ఉన్న సదరు విద్యుత్తు టవర్లను తొలగించాలని వారు కోరారు. రైతులు విద్యుత్తు టవర్ల నిర్మాణం మీద నిపుణులు ఇచ్చిన నివేదక శాస్త్రీయబద్దంగా లేదని రైతులు చెబుతున్నారు. ఇటీవల పలు ప్రాంతాల్లో అనుసరిస్తున్న భూగర్భ కేబుళ్లు వేసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: