40 రోజులుగా తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల ప్రజలకు సత్వరం తాగునీటి సరఫరా చేయాలని.... ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య డిమాండ్ చేశారు. లింగాల వద్ద ఉన్న తాగునీటి పథకాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సందర్శించారు. 40 రోజుల క్రితం నీరు సరఫరా చేసే ప్రధాన పైపులైన్ మరమ్మతులకు గురైతే.. ఇప్పటికి దాన్ని మరమ్మతులు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ప్రజలు తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెదేపా హయాంలో ప్రత్యేక నిర్మాణాలు చేపట్టి తాగునీరు అందించామని గుర్తుచేశారు. అధికారులు మేల్కొని... నీటి సరఫరాకు త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో తెదేపా ఆధ్వర్యంలో తాగునీటి పథకాల వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: