పోలీసులమంటూ వాహనాలను ఆపి తనిఖీల పేరిట కాసేపు హంగామా చేస్తారు. సరైన పత్రాలు లేవంటూ అందినకాడికి దోచుకుంటారు. ఈజీ మనీ కోసం కొందరు యవకులు అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ పోలీసుల అవతారమెత్తి.. అమాయకులే లక్ష్యంగా అడ్డంగా దోచేస్తున్నారు. కృష్ణా జిల్లా రామవరం వద్ద ఇసుక లారీల నుంచి డబ్బులు వసూలు చేసిన నలుగురు నకిలీ పోలీసులను అరెస్టు చేశారు. వాహన పత్రాలు సరిగా లేవంటూ దోపిడీకి పాల్పడినట్లు కైకలూరు పోలీసులు గుర్తించారు. లారీ యజమాని ఫిర్యాదు మేరకు ఫేక్ పోలీసులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.
ఇదీ చదవండి
RRR: 'సీఎం పర్యటనకు వెళ్లినప్పుడల్లా.. బొత్స అలాగే మాట్లాడతారు'