పోలీస్ సిబ్బంది అని చెప్పి దొంగతనం చేసిన వారిని అరెస్ట్ చేసినట్లు గుడివాడ సీఐ అబ్దుల్ నబి తెలిపారు. సోమవారం రాత్రి పోలీస్ సిబ్బంది అని చెప్పి కుందేటి వెంకన్న బాబు అనే గొర్రెల కాపరిని బెదిరించి గొర్రెను ఎత్తుకొని వెళ్లిన నిందితులను అరెస్ట్ చేశారు. నందివాడ గ్రామానికి చెందిన పూర్ణ, జగదీశ్ అతనికి సహకరించారని వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి: పాఠాలు చెబుతూనే.. ప్రాణాలు విడిచిన ఉపాధ్యాయిని