రాజధాని అమరావతి పై బాధ్యత గల మంత్రులు కేవలం ఒక సామాజిక వర్గానికి లాభం చేకూరేలా ఉందనడం సరికాదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు అవసరం లేదని.. అమరావతిని సహజంగానే నిర్మించవచ్చని తెలిపారు. ఇప్పటికే అమరావతిలో సచివాలయం ,అసెంబ్లీ, ఇతర శాఖలు కొలువుదీరి ఉన్నాయని చెప్పారు . వాటిని కొనసాగిస్తూ ఖర్చు లేకుండా పరిపాలన చేయవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఉత్తరాంధ్రలో వ్యవసాయానికి మంచి అవకాశాలున్నాయని అన్నారు . దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వంశధార, నాగావళి ప్రాజెక్టులను పూర్తి చేస్తే వలసలు తగ్గుతాయన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని...రాజధానిగా మాత్రం అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇదీచూడండి.'స్వాతంత్ర్య సాధనలో ఆంధ్రప్రాంత ప్రజల పాత్ర కీలకం'