చిలకలూరిపేటలో జాతీయ రహదారి పక్కన ఉన్న శ్మశాన ప్రాంగణంలో అభివృద్ధి పనుల పేరిట సమాధులను పురపాలక సంఘం అధికారులు కూల్చేశారని.. ఈ ఘటనతో దళితుల మనస్సులు గాయపడ్డాయని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
తెదేపా ఎస్సీ సెల్ నేతలతో కలిసి ప్రత్తిపాటి.. శ్మశాన ప్రాంగణాన్ని, కూల్చిన సమాధులను పరిశీలించారు. సంఘటన జరిగి 2 వారాలైనా.. అధికారులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేని ప్రశ్నించారు. దళితుల సమాధులు కూల్చిన ఘటనలో సదరు అధికారికి ప్రమోషన్ ఇవ్వడం.. వైకాపా ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: