ETV Bharat / state

త్వరలోనే బందరు పోర్టు కల సాకారం.. జనవరిలో పనులు: పేర్ని నాని - Nani comments on Bandar port

EXMINISTER PERNI NANI ON BANDAR PORT : బందరు పోర్టు కలను త్వరలోనే సాకారం చేస్తామని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. జనవరి, ఫిబ్రవరిలో బందరు పోర్టు పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

EXMINISTER PERNI NANI ON BANDAR PORT
EXMINISTER PERNI NANI ON BANDAR PORT
author img

By

Published : Nov 30, 2022, 3:45 PM IST

PERNI NANI ON BANDAR PORT : త్వరలోనే బందరు పోర్టు కలను సాకారం చేస్తామని మాజీమంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. 2023 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పోర్టు పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. గత పాలకులు శిలాఫలకాల పేరుతో బందరు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వమే పోర్టు పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సీఎం జగన్ చేతుల మీదుగా పోర్టు పనులు ప్రారంభిస్తామని నాని వెల్లడించారు. పోర్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని... అవి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు.

తొలి విడత పోర్టు పనులన్నీ 1736 ఎకరాల ప్రభుత్వ భూముల్లోనే జరుగుతాయన్నారు. రైల్ కం రోడ్ కనెక్టివిటీకి 235 ఎకరాలు సేకరించాల్సి ఉందని,.. రెండు నెలల్లో భూసేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. పనులు ప్రారంభమైన 30 మాసాల్లో పోర్టు పనులు పూర్తి చేస్తామన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.