వైకాపా ప్రభుత్వంలో బీసీల అభివృద్ధి కాగితాలకే పరిమితమైందని మాజీమంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. నామినేటెడ్ పదవులు సహా, స్వయం సహాయక రుణాల్లోనూ బలహీనవర్గాలను దారుణంగా వంచించిందని ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు 2.50 కోట్ల మంది బీసీలుంటే, వైకాపా ప్రభుత్వం నవరత్నాల కింద కేవలం 4లక్షల 37వేల మందికి మాత్రమే న్యాయం చేసిందన్నారు.
గత ప్రభుత్వం బీసీలకు అమలు చేసిన ఆదరణ పథకాన్ని సీఎం జగన్ రద్దు చేశారని ఆక్షేపించారు. బీసీలకు రూ. 33 వేల కోట్లు ఖర్చు చేశామని గొప్పులు చెప్పుకుంటున్న సీఎం జగన్, మంత్రులు ఎవరికి, ఎప్పుడు, ఏ పథకం కింద సాయం చేశారో.. వివరాలు బయటపెట్టాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల