ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ను ఆదర్శంగా తీసుకుని.. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం వైకాపా ఎంపీలు రాజీనామా చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. కర్మాగారాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి పొరాటానికైనా తెదేపా సిద్ధమని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తేల్చిచెప్పారు
ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటీకరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని రవీంద్ర ప్రశ్నించారు. "ట్విట్టర్ వేదికగా చిలక పలుకులు పలికే విజయసాయిరెడ్డి.. ప్రధాని ముందు మోకరిల్లారా" అంటూ నిలదీశారు. తన మంత్రులను సీఎం జగన్ అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పాలి అంటే తెదేపా మద్దతుదారులను గెలిపించాలని కోరారు.
'ప్రభుత్వతీరు గర్హనీయం'
రాజ్యాంగ వ్యవస్థల పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు గర్హనీయమని మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనీస విచక్షణ లేకుండా ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహించారు. తక్షణం ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సీఎం, మంత్రుల తీరును ప్రజలు ఆదర్శంగా తీసుకుంటే.. రాష్ట్రంలో అరాచకం తప్ప ఇంకేమీ మిగలదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బాక్సుల ఏర్పాటు