కృష్ణా జిల్లా నూజివీడులోని అజరయ్యపేట ప్రాంతానికి చెందిన పేరబత్తుల వెంకటేశ్వరరావు ఏడాది క్రితం మృతి చెందాడు. ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక స్నేహ రైడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థలోని అనాథ బాలలు, సమీపంలోని పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. కరోనా విస్తరిస్తున్న తరుణంలో అన్నదానం నిర్వహిస్తే ప్రజల తాకిడికి వైరస్ మరింతగా ఉధృతమవుతోందనే ఆలోచనతో 50 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వినూత్న రీతిలో ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ, విచక్షణతో, సమాజ శ్రేయస్సు కోరి చేసిన ఈ చిన్న కార్యక్రమం అందరిలో మంచి ఆలోచనలు కలిగించే విధంగా ఉందంటూ పలువురు సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు.
ఇవీ చూడండి...