ETV Bharat / state

ఆదరణ కోల్పోతున్న ఇంజినీరింగ్ విద్య - emcet

రాను రాను ఇంజినీరింగ్ విద్య ఆదరణ కోల్పోతోంది. పేరున్న కళాశాలల్లో మినహా మిగతా వాటిలో సీట్లు ఖాళీగానే మిగిలిపోతున్నాయి. ఈ ఏడాదీ అదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 90వేల సీట్లు ఉండగా.... ఇప్పటివరకు 60వేల మంది విద్యార్థులు మాత్రమే కౌన్సెలింగ్‌ రుసుము చెల్లించారంటేనే పరిస్థితి అర్థమవుతోంది.

engineering-studies
author img

By

Published : Jul 6, 2019, 9:22 AM IST

Updated : Jul 6, 2019, 1:24 PM IST

ఆదరణ కోల్పోతున్న ఇంజినీరింగ్ విద్య

రాష్టంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో మొత్తం 90వేల కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. మేనేజ్‌మెంట్ కోటాలోని మరో 40వేల సీట్లను కలుపుకుని మొత్తం లక్షా 30వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. గత నాలుగేళ్లుగా ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సీట్లు అంతంత మాత్రంగానే నిండుతున్నాయి. పేరున్న కళాశాలల్లో మాత్రమే మేనేజ్‌మెంట్ కోటా సీట్లు భర్తీ అవుతున్నాయి. సాధారణ కళాశాలలైతే కన్వీనర్ కోటాలో సీట్లు నింపుకోడానికీ నానా తంటాలు పడుతున్నాయి..

ఈ ఏడాది లక్షా 31 వేల 994 మంది విద్యార్థులు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఉత్తీర్ణత సాధించగా... కౌన్సెలింగ్‌లో జాప్యం వల్ల చాలా మంది ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల్లో చేరిపోయారు. మంచి ర్యాంకు రాలేదనుకున్న మరికొందరు ఇతర డిగ్రీ కోర్సులను ఎంచుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం పరీక్షలు రాసి మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు అటు వెళ్లిపోయారు. ఈ నెల 1 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుండగా.... నేటితో ఇది ముగియనుంది.

ఇప్పటివరకు కేవలం 61వేల 655 మంది విద్యార్థుల మాత్రమే ఆన్‌లైన్‌లో రుసుములు చెల్లించారు. గడువు ముగిసే నాటికి కనీసం 70వేల మందైనా రుసుములు చెల్లిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఈడబ్ల్యూఎస్, కాపు రిజర్వేషన్ల అంశంపై కేంద్రం నుంచి స్పష్టత రాకపోవడమూ విద్యార్థులు వెనుకంజ వేసేందుకు కారణమవుతోంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో లోకల్‌ స్టేటస్‌ ధ్రువపత్రాల విషయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు అధికారులను కోరుతున్నారు.

Intro:ఒక వ్యక్తి ఒక అంశంలో ప్రతిభ కలిగి ఉండటం సర్వసాధారణం. అదే రెండు, మూడు అంశాల్లో సత్తా చాటితే అబ్బో అంటాం. అయితే ఓ వ్యక్తి 10 అంశాల్లో పట్టు సాధించి పథకాలు సాధిస్తుంటే, అది ఓ బాలిక అయితే అద్భుతం కన్నా సకలకళా ప్రతిభావని అన్నా తక్కువే. ఆ బాలికే అనంతపురం జిల్లా, తాడిపత్రి పట్టణానికి చెందిన కొప్పారపు సురేష్, ఉమామహేశ్వరిల కుమార్తె "హనీషా కొప్పరపు"

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కొప్పరపు సురేష్ స్టిక్కరింగ్, ఫ్లెక్స్ ప్రింటింగ్ దుకాణం నిర్వహిస్తున్నాడు. వీరి కుమార్తె హనీషా కొప్పరపు ఇటీవల పదవ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలోకి అడుగిడుతోంది. హనీషా చిన్నతనం నుంచే కళల్లో ప్రావీణ్యం సాధించి ఏకంగా పది కలల్లో మేటిగా నిలిచి పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది..

బ్యాడ్మింటన్, చిత్రలేఖనం, పియానో, కలరివిద్య, ఆంగ్లం, తెలుగు, భాషల్లో పాటలు, కొటేషన్లు సొంతంగా రాయడం, పాడటం. భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు చేయడం. రెండు చేతులతో ముత్యాల్లాంటి దస్తూరి, కంప్యూటర్ కీబోర్డ్ లోని అన్ని అక్షరాలను రెండు సెకన్ల వ్యవధిలో టైప్ చేయగలగడం హనీషాకు మాత్రమే సొంతం.

హనీషా మదనపల్లిలో ఏడో తరగతి చదివే సమయంలో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది. ఎనిమిదవ తరగతిలో పాఠశాలలో తొలి విజయాన్నందుకుంది మొదలు తాలూకా, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలిచి అనేక పథకాలు, ప్రశంసా పత్రాలు అందుతుంది. ఒకసారి జాతీయ పోటీలకు కూడా ఎంపికైంది. త్వరలోనే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు ప్రస్తుతం హైదరాబాద్ లో శిక్షణ తీసుకుంటోంది.

హనీషా తండ్రి కొప్పరపు సురేష్ చిత్రకళాకారుడు. తండ్రి గీసిన చిత్రాలు చూస్తూ పెరిగిన హనీష తన తండ్రి వద్ద శిక్షణ పొందిది. ఎలాంటి చిత్రాన్నయినా చూస్తూ నిమిషాల్లో గీస్తుంది. పాఠశాల స్థాయి చిత్రలేఖనం పోటీల్లో హనీషాకే మొదటి బహుమతి..

సాధారణంగా అందరూ కుడి చేతితో రాస్తుంటారు. కొద్దిమందికి ఎడమ చేయి అలవాటు ఉంటుంది. కానీ హనీషా మాత్రం ఇందుకు భిన్నంగా ఏ చేతితో అయినా ముత్యాల్లాంటి అక్షరాలు రాస్తుంది. ఒకే సారి రెండు చేతులతో కూడా రాస్తుంది. రెండింటిలో చిన్నపాటి వ్యత్యాసం కూడా మనం గుర్తించలేం.

గత రెండేళ్ల నుంచి పియానో నేర్చుకుంది. మనం ఎలాంటి పదాలు, పాటలను చెప్పినా వాటిని పియానోలో వాయించడం హనీషా ప్రత్యేకత. ఇప్పటివరకు 10 ఆంగ్ల, తెలుగు పాటలతో పాటు 120 కొటేషన్స్ రాసింది. తన పాటలకు తానే ట్యూన్ కట్టుకుంటుంది. అంతే కాదు అద్భుతంగా పడుతుంది కూడా..

హనీషా ఎనిమిదవ తరగతి చదివే సమయంలో అస్వస్థతతో నెల రోజుల పాటు ఇంటి వద్దనే ఉంది. ఆ సమయంలో కంప్యూటర్ ముందు కూర్చొని కీబోర్డ్ టైప్ చేయడం ప్రారంభించింది. బ్రెజిల్ దేశానికి చెందిన 12 ఏళ్ల బాలిక 2.15 సెకన్లలో కీబోర్డ్ టైపింగ్ లో రికార్డు చూసింది. ఆ రికార్డు అధిగమించాలని దాదాపు 20 రోజులు సాధన చేసి 1.7 సెకన్ల వ్యవధిలో పూర్తి చేసి సరికొత్త రికార్డును సృష్టించింది.

చిన్నతనం నుంచే కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుంది. తలపై మూడు చెంబులు, వాటిపై దీపం, రెండు చేతుల్లో రెండు దీపాలు పెట్టుకొని నృత్యం చేయడం చాలా కష్టం. అలాంటిది కుండపై నిల్చుని వివిధ నృత్య భంగిమలు చేయడం హనీషా ప్రత్యేకత. ఇప్పటివరకు నృత్య పోటీల్లో పదికి పైగా బహుమతులు, ప్రశంసాపత్రాలను అందుకుంది. జానపద నృత్యాల్లో కూడా ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకుంది.

ఒలంపిక్స్ లో జరిగే బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని దేశానికి స్వర్ణం సాధించాలనే హనీషా లక్ష్యం.. ఇందుకోసం ఎనిమిదవ తరగతి నుండి పాఠశాలకు వెళ్లకుండా బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకుంటోంది. క్రీడలతో పాటు చదువు ప్రాముఖ్యత తెలుసుకున్న తల్లిదండ్రులు తొమ్మిది, పది తరగతులను ప్రయివేటుగా ఇంటి వద్దనే చెప్పించారు. దీంతో ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షలలో హనీషా 9.8 మార్కులు సాధించింది..

Body:ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598

Conclusion:తాడిపత్రి, అనంతపురం జిల్లా
Last Updated : Jul 6, 2019, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.