ETV Bharat / state

వేతనాల సమరంలో.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి కొత్త చిక్కు

Employees associations in Dispute : ఏపీలో రెండు ఉద్యోగ సంఘాల మధ్య మొదలైన మాటల యుద్ధం క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఉద్యోగుల వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాజ్ భవన్ మెట్లెక్కితే.. ఏపీ ఎన్జీఓల సంఘం ఆక్షేపిస్తోంది. ఉద్యోగుల సంఘం నిబంధనల్ని ఉల్లంఘించిందని.. దాని గుర్తింపు రద్దు చేయాలంటూ సీఎస్ కు ఫిర్యాదు చేయడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం గుర్తింపు అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Employees associations
ఏపీ ఎన్జీఓ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
author img

By

Published : Jan 21, 2023, 9:53 PM IST

Employees associations in Dispute : ఉద్యోగుల వేతనాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన అంశం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దయ్యే పరిస్థితులకు దారి తీస్తోంది. సర్వీసు నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ఏపీఎన్జీఓ సంఘం ఈ వ్యవహారంపై సీఎస్ కు ఫిర్యాదు చేయటంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల వేతనాలు అడిగితే సంఘం గుర్తింపు రద్దు చేసేంత వరకూ పరిస్థితులు వెళ్లటంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

గుర్తింపు రద్దు చేయాలంటూ సీఎస్ కు ఫిర్యాదు : ఏపీలో రెండు ఉద్యోగ సంఘాల మధ్య మొదలైన మాటల యుద్ధం క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఉద్యోగులకు వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాజ్ భవన్ మెట్లెక్కితే.. ఏపీ ఎన్జీఓల సంఘం ఈ వ్యవహారం సరైంది కాదని ఆక్షేపిస్తోంది. ఆ ఫిర్యాదును తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపటం తప్ప గవర్నర్ ఏం చేయగలరని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీజీఈఏ సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించిందని దాని గుర్తింపు రద్దు చేయాలంటూ సీఎస్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై ఉద్యోగుల్లో విస్మయం వ్యక్తం అవుతోంది.

ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహించారని అభియోగాలు : ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోసం పోరాడేందుకు ప్రయత్నం చేస్తున్న సంఘం గుర్తింపు రద్దు కోసం ఫిర్యాదు చేయటం ఏమిటని ఉద్యోగులు వ్యాఖ్యనిస్తున్నారు. ఒక ఉద్యోగ సంఘం గవర్నర్ కు ఫిర్యాదు చేయటంపై గుర్రుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలే మరో ఉద్యోగ సంఘంతో సర్వీసు నిబంధనల ఉల్లంఘనల పేరిట ఫిర్యాదు చేసేలా ప్రోత్సహించారని ఆరోపణలు వినవస్తున్నాయి. మరోవైపు తమకు అందిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు అంశంపై యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

సూర్యనారాయణకు నోటీసులు : గతంలోనూ ఈ సంఘం నేతలు ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన అంశంపై రాష్ట్ర పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వద్ద చేసిన ఆందోళననూ దృష్టిలో ఉంచుకుని సదరు సంఘం నేతలపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ఘటనకు సంబంధించి నేరుగా సంబంధిత శాఖ కార్యదర్శి కూడా ఏపీజీఈఏ నేత సూర్యనారాయణకు వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు కూడా గతంలో జారీ చేశారు. ప్రస్తుతం ఇదే సంఘం గవర్నర్ కు తమ జీత భత్యాలు, ఇతర అంశాలపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సర్వీసు నిబంధనల ఉల్లంఘనల పేరు చెప్పి గుర్తింపు రద్దు చేసే అంశంపై ప్రభుత్వం అలోచన చేస్తోంది.
గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతోనే చిక్కులు : గతంలోనూ ఓ దఫా ఏపీ ఎన్జీఓ సంఘం ఇచ్చిన ఫిర్యాదు పై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు అక్రమం కాదంటూ ముఖ్యమంత్రి కార్యాలయం తేల్చింది. ప్రస్తుతం ప్రభుత్వంపైనే గవర్నర్ కు ఫిర్యాదు చేయటంతో ఈ అంశంపై మరింత ఆజ్యం పోసేందుకే ఇతర సంఘాలతో ప్రభుత్వ పెద్దలు మాట్లాడిస్తున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజ్ఞప్తి ఇచ్చేందుకు డైరీ ఆవిష్కరణ అంటూ గవర్నర్ కార్యాలయాన్ని కూడా తప్పు దోవ పట్టించారంటూ ఏపీ ఎన్జీఓ సంఘం నేత బండి శ్రీనివాస్ ఆరోపణలు చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.