ఇదీ చూడండి: 'సమాజంలో మీడియాది కీలక పాత్ర'
ఉత్సాహంగా 'గూడవల్లి డీజేఆర్'లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - eenadu sports league in gudavalleru DJR engineering college
ఈనాడు - ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న... ఈనాడు స్పోర్ట్స్ లీగ్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు కృష్ణా జిల్లా గూడవల్లి డీజేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఐదో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో మూడు మ్యాచ్లు పోటాపోటీగా జరిగాయి. మెుదటి మ్యాచ్లో కేబీఎన్ డిగ్రీ కళాశాల x విశ్వభారతి డిగ్రీ కళాశాలకు చెందిన జట్లు తలపడగా కేబీఎన్ డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది. రెండవ మ్యాచ్లో జూనియర్స్ విభాగంలో కేబీఎన్ జూనియర్ కళాశాల x విశ్వభారతి జూనియర్ కళాశాల జట్లు తలపడగా కేబీఎన్ జూనియర్ కళాశాల జట్టు విజయం సాధించింది. మూడో మ్యాచ్లో ఏఏఆర్ అండ్ బీఎంఆర్ డిగ్రీ కళాశాల x జీడీఎంఎం ఇంజినీరింగ్ కళాశాల జట్లు తలపడగా జీడీఎంఎం కళాశాల జట్టు విజయం సాధించింది.
ఉత్సాహంగా 'గూడవల్లి డీజేఆర్'లో సాగిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్
ఇదీ చూడండి: 'సమాజంలో మీడియాది కీలక పాత్ర'
sample description
Last Updated : Dec 21, 2019, 7:23 PM IST