కనక దుర్గమ్మ హుండీలో భక్తులు సమర్పించిన కానుకల్లో చేతివాటం ప్రదర్శించిన ముగ్గురి దగ్గర నుంచి 12 గ్రాముల బంగారు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆలయంలోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు.. మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. స్వీపర్ సింహాచలం బంగారంతో పాటు పదివేల రూపాయలు నగదు చోరీ చేసినట్లు తేల్చారు. ఈ నగదును మార్గమధ్యంలో మరో ఉద్యోగికి అందించినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరిపైనా కేసులు నమోదు చేశారు. దుర్గగుడిలో నిఘా మరింత పటిష్ఠం చేస్తామని, హుండీ లెక్కింపు సమయంలో...మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆలయ ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన సెక్యూరిటీ సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి:దారుణం: మనవరాలిని... కామంతో 'కడతేర్చాడు!'