విరివిగా వర్షాలు పడి రాష్ట్రం సుభిక్షం కావాలని ఆకాంక్షిస్తూ... వరుణ యాగం నిర్వహించనున్నట్టు దుర్గగుడి కార్యనిర్వాహణాధికారి కోటేశ్వరమ్మ వెల్లడించారు. ఈనెల 20 నుంచి 24 వరకూ వరుణ యాగం జరుగుతుందని తెలిపారు. ఈనెల 20నుంచి 22 వరకూ ఉదయం 6 గంటల నుంచి రెండు గంటలపాటు దేవస్థాన వేదం విద్యార్థులు, అర్చక స్వాములు దుర్గాఘాట్‌లో వరుణ జపం, వరుణానుపాక, శతానువాక, విరాట్ పర్వ పారాయణం చేస్తారని వివరించారు. 23వ తేదీ ఉదయం 7 నుంచి 11 గంటల వరకూ మండపారాధనలు, తత్సంబంధిత దేవతామంత్ర హవనములు జరుగుతాయని తెలిపారు. చివరి రోజు 24న ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ సహస్ర ఘటాభిషేకం జరుగుతుందని వివరించారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని... 20నుంచి యాగం - temple
రాష్ట్రం సస్యస్యామలంగా ఉండాలని కాంక్షిస్తూ... ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ... దుర్గామల్లేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించనున్నారు.